Edupayala temple Room booking online మీరు ఏడుపాయల టెంపుల్ కి వెళ్తున్నారా అయితే

Edupayala temple Room booking online

మీరు ఏడుపాయల టెంపుల్ కి వెళ్తున్నారా అయితే జాగ్రత్త


నేను 9-06-2023వ తారీకు రోజున పొద్దున ఏడుపాయల దుర్గామాతరం దర్శించుకోవడానికి ఏడుపాయలకి వెళ్ళటం అయితే జరిగింది నేను మా ఫ్యామిలీతో సహా ఏడుపాయల వెళ్ళాము.

మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే నా కొడుకుకి అంటే మా అన్వేష్ కి వెంట్రుకలు తీసేసాము అంటే గుండు చేపించాము అన్నమాట.


అదేవిధంగా ఏడుపాయలు లో ఉన్న అమ్మవారిని దర్శించుకుని ఆమె అంటే తల్లి యొక్క ప్రసాదాలు తీసుకుని వచ్చాము. అయితే మేము ఏడుపాయల్లో ఎంజాయ్ చేసే విషయాలు మీకు చెప్తాను ఈ ఆర్టికల్ని మీరు పూర్తిగా చదవటానికి ప్రయత్నం అయితే చేయండి.


మేము ఏడుపాయల అమ్మవారిని దర్శనం దర్శించుకునే ముందు ఆ ప్లానింగ్ ఈ విధంగా వేసుకున్నాము ఆ ప్లానింగ్ గురించి మీకు వివరించడం అయితే జరుగుతుంది. మేము రెండు రోజుల ముందే ఏడుపాయల విలుదామని నిర్ణయించుకున్నాము అప్పుడు వెళ్లడానికి ఒక ఆటో మాట్లాడుకున్నాము ఆటకు ఆయన ఖర్చు 2500 రూపాయలు అయినవి. తర్వాత నేను మా ఫ్యామిలీ అదేవిధంగా కొంతమంది బంధువులతో కలిసి ఏడుపాయల అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లడం అయితే జరిగింది. మరి ముఖ్యంగా ఏడుపాయలకి వెళ్లేటప్పుడు పచ్చటి వాతావరణం మధ్యలో నుంచి వెళ్లితే మనసుకు ప్రశాంతంగా హాయిగా అనిపించింది. ముఖ్యంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము టెంట్ హౌస్ తీసుకున్నాము అయితే ఎవరైతే టెంట్ హౌస్ కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా అక్కడ టెంటు లభిస్తుంది. ఆ టెంట్ ని మనం వాడుకున్నందుకు మనీ పే చేయవలసి ఉంటుంది.


కాకపోతే అక్కడ మనం ఏది కొనాలన్నా చాలా రేటు ఎక్కువగా చెబుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా మనం అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తాము అక్కడ మనం కాలి వాటర్ బాటిల్ తీసుకోవాలన్న డబల్ చార్జి చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా లీటర్ వాటర్ కొనడానికి 10 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఒకవేళ మీరు వంట చేసుకోవాలంటే కట్టెలు కొనుక్కోవాల్సి ఉంటుంది చిన్న కట్టెలమోపు 100 నుంచి 300 రూపాయల వరకు ఉంటుంది మరీ ముఖ్యంగా జాతర సమయాలలో 1000 నుంచి 1500 వరకు ఉంటుంది. ముఖ్యంగా అక్కడ తిను బండరాలు తీసుకోవాలి అంటే చాలా ఖర్చు అవుతుంది ముఖ్యంగా అక్కడ ఉన్న వ్యాపారులు మన దగ్గర నుండి బోలెడంత డబ్బు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు అంటే రేటు ఎక్కువ చెప్పి డబ్బు తీసుకుంటారు.


మరి ముఖ్యంగా బోనాలు తీయడానికి డప్పుల వాళ్ళు ఉంటారు వారు మాత్రం ఘోరంగా డబ్బులు వసూలు చేస్తుంటారు.


ముఖ్యంగా మీరు ఏడుపాయల వెళ్లాలంటే ఇంటి నుండే మీరు సామాను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇక్కడి నుండి అంటే మీ ఇంటి నుండి వాటర్ డబ్బులు తీసుకువెళ్లండి అంటే నీటితో సహా తీసుకువెళ్లండి.


ఈ విధంగా మీరు ఇంటి నుంచి తీసుకువెళ్తే మీకు మనీ అనేది చాలా సేవ్ గా ఉంటుంది. ముఖ్యంగా మీరు అక్కడ ఏడుపాయలలో ఎలాంటి వస్తువులు కొనుక్కోకుండా జాగ్రత్తగా ఉండండి అంటే మీకు ఏది కావాల్సిందో అది ఇంటి నుంచి తీసుకుపోవటం చాలా బెటర్ అని నా అభిప్రాయం.


కేవలం అమ్మవారిని దర్శించుకొని మీరు తినటానికి ఏర్పాటు చేసుకోవడానికి సామాను మొత్తం అంతా కూడా ఇంటి నుండి తీసుకువెళ్లడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా చేస్తే మీ దగ్గర మనీ అనేది సేవ్ అవుతుంది.


కేవలం అక్కడ టెంట్ మాత్రమే తీసుకోండి మిగతావి మాత్రం ఇలాంటివి తీసుకోకపోవడం బెటర్ అని నా అభిప్రాయం.


మరి ముఖ్యంగా మీరు చేయవలసిన పని ఏమిటంటే అక్కడ ఏడుపాయలలో వాగుల్లో మీరు స్నానం చేయవలసి ఉంటుంది కాకపోతే మీరు చాలా జాగ్రత్తగా లోతుల్లోకి వెళ్లకుండా మెట్లపైనే స్థానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఈత వస్తే పర్వాలేదు కానీ రాకపోతే చాలా ప్రమాదకరం అని గుర్తుంచుకోండి.


ముఖ్యంగా మీరు అంటే ఆడవారు బంగారు ఆభరణాలు వేసుకోకపోవడమే ఉత్తమం ఎందుకంటే ఏమో చెప్పలేం అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటుందో దొంగ ఎవరో దొర ఎవరో తెలియదు కాబట్టి మీరు ఎక్కువ ఆభరణాలు వేసుకోకపోవటమే చాలా మంచిది అని నా అభిప్రాయం. మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే అమ్మవారిని దర్శించుకుని ప్రసాదం మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయండి మిగతావి తీసుకోకపోవటమే మంచిది.


మరీ ముఖ్యంగా మీ పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి తప్పిపోయే అవకాశం ఉంటుంది ఒకవేళ తప్పిపోయిన అక్కడ పోలీసుల వారిని సంప్రదిస్తే ఇలాంటి ప్రాబ్లం ఉండదు కాకపోతే అలా జరగకుండా తగు జాగ్రత్తగా తీసుకొని మీరు వెళ్ళండి.


చాలామంది చేసే పని ఏమిటంటే వెళ్ళిన తర్వాత మందు పదార్థాలు తీసుకుని వెళుతూ ఉంటారు. తీసుక వెళ్లిన సరే ఒక లిమిట్ వరకు తాగండి లిమిట్ అయిపోయినంతవరకు తాగకండి ఎందుకంటే ఇది మీకే ప్రమాదం అని గుర్తుంచుకోండి ఎందుకంటే మనం తిరిగి ఇంటికి రావాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.


అదేవిధంగా చిన్నపిల్లలకు కావలసిన ఆట వస్తువులు కొనకపోవటమే చాలా మంచిది ఎందుకంటే ఏది కొనాలన్నా చాలా ఎక్కువ రేటు చెబుతూ ఉంటారు అక్కడి వ్యాపారులు. మీరు అదే డబ్బులు అక్కడ పెట్టే బదులు బయట మీకు తక్కువ రేటులో వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు చేస్తేనే చాలా మంచిదండి.


ముఖ్యంగా మీరు అక్కడ వంటలు చేయాలన్నా అక్కడ పాత్రలు రెండు తీసుకోవాల్సి ఉంటుంది. వాటికి డబ్బులు పే చేయవలసి ఉంటుంది. అందుకే మీరు ఇంటి నుంచి తీసుకువెళ్లడానికి ప్రయత్నం చేయండి లేకపోతే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయని గుర్తుంచుకోండి. హరి ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మీరు అనవసర ఖర్చులు పెట్టుకోకండి ఎందుకంటే డబ్బులు సేవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి లేకపోతే డబ్బు అనేది చాలా ఖర్చు అవుతుంది.


నేను ఇంతకుముందు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మాజా బాటిల్ కొనుగోలు చేశాను మాజాపాటి పై 70 రూపాయలు ఉంది కానీ వాళ్ళు వసూలు చేసిన రూపాయలు ఎంతో తెలుసా 120 రూపాయలు చూడండి ఎంత మోసం చేస్తారో అక్కడ వ్యాపారులు. అందుకోసమే అక్కడ మీరు ఏది పడితే అది తినకపోవడమే మంచిది. ఇంటి నుంచి తీసుకు వెళ్లడం చాలా ఉత్తమం.


ఈ విషయం తప్పకుండా గుర్తుంచుకోండి ఎందుకంటే చాలామందికి తెలియకుండా ఇక్కడికి వస్తూ ఉంటారు డబ్బు ఉన్న వాళ్లకు ఏమీ కాదు కానీ డబ్బులేని వారికి మాత్రం చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి.


మనలాంటి మిడిల్ క్లాస్ వారికి అయితే మరీ ఘోరం గా ఉంటుంది. డబ్బు బాగా ఉందంటే వారికి ఎలాంటి ప్రాబ్లం కాదు. డబ్బు లేని వారికి చాలా ఇబ్బంది అవుతుంది ఆ విషయం మాత్రం తప్పని సరిగా గుర్తుంచుకోండి లేకపోతే మీ ఇష్టం.


మరీ ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే మొత్తం దర్శనం అంతా అయిపోయిన తర్వాత మీరు తొందరగా ఇంటికి రావటమే ఉత్తమం చీకటి పడ్డాక వేచి చూడకుండా తొందరగా వచ్చే ప్రయత్నం అయితే చేయండి. సూర్యకిరణాలు ఉన్నప్పుడే ఇంటికి తిరిగి రావడం చాలా ఉత్తమమని గుర్తుంచుకోండి.


మీరు వచ్చిన దూరాన్ని బట్టి మీరు తొందరగా రావటమే ముఖ్యంగా గుర్తుంచుకోండి.


మీరు ఇంటి నుంచి వెళ్లేటప్పుడు పాత్రలు అంటే వండుకోవడానికి అదేవిధంగా తినుబండారాలు మొదలైన వాటి ఇంటి నుంచి తీసుకపోవడమే చాలా ఉత్తమం అని నా అభిప్రాయం. ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే నేను వెళ్లాను కాబట్టి నా యొక్క అభిప్రాయం మీతో పంచుకోవాలనిపించింది కాబట్టి నేను బ్లాగు రూపంలో మీకు తెలియజేస్తున్నాను లేకపోతే నీకే ప్రమాదము గుర్తుంచుకోండి సుమా


మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఈత వచ్చిన వాళ్ళు మాత్రమే ఈత కొట్టండి ఈత రాని వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈత కొట్టకుండా జాగ్రత్తగా ఉండండి.


కాకపోతే అక్కడ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీరు ఆభరణాలు ఎక్కువగా ధరిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే ఎవరు దొంగ ఎవరు దొరో తెలియదు కాబట్టి చాలా ప్రమాదం. ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు తప్పకుండా పాటించండి లేకపోతే అనవసరమైన ప్రమాదాలు మీరు గురికావాల్సి వస్తుంది.


ఎందుకంటే నాకు తెలిసిన అభిప్రాయాలు నీతో పంచుకోవాలని నేను ఈ ఆర్టికల్ లో చెప్పడం అయితే జరిగింది తర్వాత మీ ఇష్టం.



కామెంట్‌లు