panchatantra kathalu in telugu writing | panchatantra kathalu telugulo

panchatantra kathalu in telugu writing | panchatantra kathalu telugulo



హాయ్ ఫ్రెండ్స్ మీకు ఇష్టమైన కథలు నేను కష్టపడి ఆర్టికల్ రూపంలో రాశాను దయచేసి పూర్తిగా చదవటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నాకు మా అమ్మ చెప్పిన కథలు నేను ఆర్టికల్ రూపంలో మీ అందరూ చదవాలని నేను ఎంతో కష్టపడి రాశాను దయచేసి చదవండి.





అనగనగా ఒక రోజు ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉండేవారు ఇద్దరు కొడుకులు కూడా చదువులలో పోటీ పడుతూ చదువుతూ ఉండేవారు. అదేవిధంగా ర్యాంకులు కూడా చాలా బాగా వచ్చేవి. ఈ విధంగా వాళ్ళ చదువు జీవితం మొత్తం కూడా సాఫీగా జరిగిపోయింది అదేవిధంగా ఇద్దరి అన్నదమ్ములకు కూడా మంచి మంచి కొరకులైతే రావడం జరిగింది. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఇద్దరికీ కూడా మ్యారేజ్ అయింది.


మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొన్ని రోజులు వీరి జీవితం హ్యాపీగా జరిగిపోయింది అదేవిధంగా పిల్లలు కూడా పుట్టడం జరిగింది తర్వాత మొదలైంది అసలు కథ అసలు కథ ఏమిటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో పూర్తిగా తెలుసుకుందాం


ఈ విధంగా జరిగిన తర్వాత అన్నదమ్ముల మధ్య బేధాభిప్రాయాలు ఏర్పడడం జరిగింది. ఈ విధంగా చినుకు చినుకు గాలివానగా వారి ఇద్దరి మధ్య కొట్లాటలు కొట్టుకునే పరిస్థితి వరకు వచ్చింది.


తర్వాత కొన్ని రోజులు మీరు మాట్లాడుకోకుండా ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా ఇలా కొంతకాలం సాగిపోయింది.


ఇది అలుసుగా తీసుకున్న వీరికి సంబంధించి కుటుంబసభ్యుడు వీరి మధ్య మరింత కొట్లాట పెట్టడం జరిగింది.


ఈ విధంగా లేనిపోని మాటలు చెప్పుతూ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టడం అయితే జరిగింది. ఇద్దరు అన్నదమ్ములు కూడా చదువులలో చాలా బాగున్నా అదే విధంగా పెళ్లయిన తర్వాత కూడా వీరి సంసారం సాఫీగా ఉన్న ఒక రోజు వీరి మధ్య చిచ్చు పెట్టిన వాడు మాత్రం చాలా బాగున్నాడు.


అయితే ఇద్దరు అన్నదమ్ములకు కూడా అనలేని మాటలు కూడా అన్నాడని మధ్యలో ఉన్నవాడు అటు ఇటు చెప్పడం జరిగింది. ఈ విధంగా మధ్యలో ఉన్న వాని మాటలు వింటూ వీరి సంసారం నాశనం చేసుకున్నారు అదే విధంగా ఇద్దరి మధ్య అన్నదమ్ముల సంబంధాన్ని కూడా వీరు నాశనం చేసుకోవడం జరిగింది.


అయితే ఒక రోజు వీరు అనుకోకుండా కొంచెం కార్యానికి వీలు వెళ్లడం జరిగింది.


ఇద్దరు అన్నదమ్ములు ఒకరికి తెలియకుండా మరొకరు వేరే వేరే రూములో ఉండటం జరిగింది. అప్పుడు ఇద్దరి మధ్యలో ఉన్న వ్యక్తి ఇద్దరి అన్నదమ్ములకు అవి ఇవి మాటలు చెప్పడం జరిగింది.


అప్పుడు అనుకోకుండా వీరి తమ్ముడు మధ్యవర్తి చెప్పే మాటలు వినడం జరిగింది. అప్పుడు ఆ తమ్మునికి తెలిసిన విషయం ఏమిటంటే మా ఇద్దరి మధ్య ఎన్ని సంవత్సరాలుగా కొట్లాట పెట్టింది ఈ మధ్యవర్తేనని గమనించి వాళ్ళ అన్నతో మాట్లాడడం జరిగింది.


అప్పుడు అన్నయ్య సరే మనం తెలియకుండా ఉందాం ఇంకేమీ మాటలు చెబుతాడు వింటాము అని వాళ్ళ అన్న చెప్పడం జరిగింది.


అయితే వాళ్ల తమ్ముడికి కూడా మధ్యవర్తి అవి మాటలు చెప్పడం జరిగింది అప్పుడు అన్న కూడా వినడం జరిగింది. మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో అతని అతనిని చితకబాది ఇన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు మన మధ్య కొట్లాట పెట్టింది ఈ మధ్యవర్తేనని గమనించక అతను చెప్పిన మాటలు వినుకుంటూ మన మధ్య సంబంధాలు లేకుండా చేసుకున్నామని ఇద్దరు చాలా బాధపడ్డారు.


భావం:- ఎట్టి పరిస్థితుల్లో మధ్య మధ్యలో వాళ్ళు చెప్పిన మాటలు నమ్మకండి



panchatantra kathalu in telugu writing | panchatantra kathalu telugulo



ఒక ఊరిలో ఒక కోతి ఉండేది ఆ కోతి చాలా చిలిపి పనులు చేస్తూ ఉండేది అదే విధంగా గ్రామాలలో ఉన్న ప్రజల దగ్గర ఆహారపు పదార్థాలు ఉంటే వాటిని దోచుకెళ్ళి తినేది అదే విధంగా ఇంట్లో ఏవైనా ఆరపదార్థాలు ఉంటే దొంగతనంగా వాటిని తీసుకొని అడవిలోకి పారిపోయేది ఈ విధంగా కోతి కొన్ని రోజులుగా చేయడం జరిగింది


తర్వాత ఆ కోతి అడవికి వెళ్ళిన తర్వాత ఆహార పదార్థాలు తిని తిరిగి గ్రామాలకి వచ్చి మళ్లీ అదే పని చేసేది ఈ విధంగా కొన్ని సంవత్సరాలుగా ఇదే పనిచేసింది


అయితే ఒక రోజు పెళ్లి చేసిన పని ఏమిటంటే ఒక తాటి చెట్టు పైన కూర్చుంది ఎవరు వస్తారా ఎవరి దగ్గర ఇలాంటి ఆరపదార్థాలు ఉన్నాయా వాటిని తీసుకుని తిందామని ఎదురుచూస్తూ ఉండేది ఈ విధంగా కొన్ని గంటలు గడిచాక ఒక అతను సైకిల్ పై వస్తున్నాడు అతని దగ్గర బఠానీలు ఉన్నాయి కోతికి ఏ విధంగా అయినా సరే బఠానీలను తీసుకొని తిందాము అని నిర్ణయం చేసుకోవడం జరిగింది.


అప్పుడు చెట్టు పై నుంచి తుంకింది. అప్పుడు కోతి తోకకు ఒక ముళ్ళు గుచ్చుకోవడం జరిగింది ముళ్ళు గుచ్చుకున్న తర్వాత తీవ్ర నొప్పితో కేకలు వేసి ఏడవడం ప్రారంభించింది.


ఈ విధంగా కొద్దిసేపు ఏడ్చిన తర్వాత ఏ విధంగా అయినా సరే ముళ్ళు తీద్దామని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసింది కానీ ఆ ముళ్ళు తీయలేక నొప్పి భరించలేక ఏడవడం ప్రారంభించింది.


ఈ విధంగా కొద్దిసేపు నానారకాలుగా ప్రయత్నం చేసింది కానీ ఎలాంటి ప్రతిఫలం లేకపోయింది.


అప్పుడు అది చూసిన బఠానీలు అమ్మే వ్యక్తి కోతి దగ్గరికి వెళ్లి ఏ విధంగా జరిగిందని అడిగాడు అప్పుడు కోతి మొత్తం వివరించి చెప్పడం జరిగింది.


నీ దగ్గర బఠానీలు చూసి నేను ఏమీ ఆలోచించి చేయకుండా తొందరగా చెట్టుపై నుంచి దుమ్కాను అప్పుడు నేను ముళ్ళపై పడి నాతోకకు ముళ్ళు గుచ్చుకోవడం జరిగింది.


అప్పుడు బఠానీలు అనే వ్యక్తి ఈ విధంగా అన్నాడు ఎప్పుడైనా సరే దురాశ దుఃఖకు చేటు అని చెప్పడం జరిగింది. అప్పుడు కోతి గమనించి అవును నేను నిజంగా గ్రామాలలో ఉండే ప్రజల దగ్గర ఆహార పదార్థాలను దోచుకొని అడవికి తీసుకువచ్చి తిని దాన్ని అదేవిధంగా మీ బఠానీలు చూసి నేను ఏ విధంగా అయినా సరే తీసుకొని తిందామని అనుకున్నాను.



కోతికి తాను చేసిన తప్పు గుర్తుకు వచ్చింది అప్పుడు ఇకమీదట ఈ విధంగా చేయకూడదు అని నిర్ణయించుకొని తన మార్పును మార్చుకొని హాయిగా జీవించడం జరిగింది


భావం:-ఈ విధంగా దురాశతో ఏ పని చేసిన కానీ ఎప్పుడూ ఒకరోజు తప్పకుండా శిక్ష అనుభవించవలసి వస్తుందని ఈ కథలోని భావం



panchatantra kathalu in telugu writing | panchatantra kathalu telugulo


అనగనగా ఒక ఊరిలో ఒక ఆవు ఉండేది ఆవుకు రెండు పిల్లలు ఉండేవి ఆ పిల్లలను చూసుకుంటూ ఆవు ఎంతో సంతోషంగా హాయిగా అడవిలో తిరుగుతూ ఆహారం తిని హాయిగా జీవించి ఉండేది.


అయితే ఒక రోజు ఆవు గడ్డిమేసుకుంటూ ఒక అడవిలోకి వెళ్ళటం జరిగింది అడవిలో ఎక్కువ పులులు మరియు సింహాలు ఉంటాయి.


ఆవు తన జీవితంలో ఎప్పుడూ ఎదుర్కొని ఒక సంఘటన ఎదురవటంతో షాకుకి గురైంది. అంటే ఆవు మిగతా వేసేటప్పుడు పులి ఎదురయింది. అప్పుడు పులి ఆవు పైకి ఒక్కసారిగా రావడం జరిగింది. అప్పుడు ఆవు పులిని ఎంతో బతిమాలింది నన్ను విడిచిపెట్టు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరిని నడపడం నా బాధ్యత కాబట్టి నేను లేకపోతే నా పిల్లలు అనాధలు అవుతారని ఎంతగానో పులిని వేడుకుంది ఆవు. అయినా పులి కరుణ చూపడం లేదు ఈ విధంగా కొద్దిసేపు ఆవు ఎంతగానో బతిమాలింది. చివరికి ఆవు ఈ విధంగా అనడం జరిగింది. మిత్రమా నా ఇద్దరి పిల్లలకు నేను ఇంటికి వెళ్లి పాలు ఇచ్చి నీ దగ్గరికి వస్తాను దయచేసి నన్ను కొద్దిసేపు విడిచి పెట్టు అని ఎంతో గాను బతిమాలింది. అప్పుడు పులి నేను నిన్ను విడిచి పెడితే తిరిగి నువ్వు నా దగ్గరికి రాగలవా అంత తెలివి తక్కువ దాని అని అనుకుంటున్నావా అని పులి అనడం జరిగింది. అప్పుడు ఆవు మిత్రమా నా పిల్లల మీద ఒట్టు నేను తప్పకుండా నీ దగ్గరికి తిరిగి వస్తాను అని ఆవు ఒట్టు తీసుకుంది అప్పుడు పులి సరే వెళ్లి నీ పిల్లలకు పాలు ఇచ్చి తిరిగి తొందరగా రా అని ఆవు చెప్పడం జరిగింది. ఈ విధంగా కొద్దిసేపు తన పిల్లలకి పాలు ఇవ్వటానికి ఇంటికి తిరిగి వచ్చింది. అప్పుడు పిల్లలతో ముద్దాడుకుంటూ ఎంతగానో ఏడ్చుకుంటూ ఆవు కళ్ళనుండి ఎంతగానో నీరు కారాయి.


అప్పుడు పిల్లలతో ఈ విధంగా చెప్పుతూ ఉంది పిల్లల్లారా మీరు అందరితో పాటు కలిసి మెలిసి ఉండండి ఎవరితో కూడా గొడవ పడకండి మేతకు వెళ్లేటప్పుడు కచ్చితంగా మీరు అందరితో కలిసి మేత మేసి అందరితో పాటు ఇంటికి రండి అని ఆవు తన ఇద్దరి పిల్లలకు చెప్పడమైతే జరిగింది.


అప్పుడు తన దుఃఖాన్ని ఆపుకోలేక ఎంతగానో పిల్లలను పట్టుకొని ఏడవడం ప్రారంభించింది. ఆ విధంగా కొద్దిసేపు తన పిల్లలతో అల్లారం ముద్దుగా దగ్గరకు తీసుకొని నేను వెళ్ళిపోతున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి అని చాలా చాలా ఏడవడం ప్రారంభించింది ఆవు. నా పిల్లల బతుకు ఏ విధంగా ఉంటుందోనని తలుచుకుంటూ తలుచుకుంటూ ఏడవడం ప్రారంభించింది. అప్పుడు దేవుని కోరుకుంటూ నేను వెళ్ళిన తర్వాత నా పిల్లలు చాలా బాగుండాలి వారికి ఎలాంటి కష్టాలు ఎదురుకాకుండా చూడు స్వామి అని ఆవు ఆకాశం వైపు చూస్తూ మొక్కడం ప్రారంభించింది.


అప్పుడు ఆవు నిజాయితీగా అడవికి వెళ్లి పులిని కలిసి నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అని ఆవు పులికి చెప్పడం జరిగింది.

అప్పుడు ఆ పులి ఆవు చెప్పిన మాటలకు కట్టుబడి తిరిగి వచ్చింది. అదేవిధంగా ఆవు కళ్ళల్లో నీళ్లు తిరగటం చూసింది పులి.


ఆవును చూసి పులి జాలి పడటం ప్రారంభించింది. అప్పుడు పులి ఆవు నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను నిన్ను విడిచి పెడుతున్నాను నువ్వు నీ పిల్లలతో హాయిగా బతుకు అని మాట ఇచ్చింది. అప్పుడు ఆవుకు ఎంత గానో సంతోషంగా ఉంది. అప్పుడు ఆవు పులిరాజా నాకు ప్రాణం బిక్ష పెట్టినందుకు మీకు వందనం చేస్తున్నాను అని ఆవు అక్కడి నుండి వెళ్ళిపోయి తన పిల్లలతో హాయిగా గడపడం జరిగింది అప్పటినుంచి ఆవు ఒంటరిగా కాకుండా అన్ని పశువులతో కలిసి మేతమేయటం ప్రారంభించింది.


భావం:-అందరితో కలిసి మెలిసి ఉండాలి 

ఒంటరిగా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశం ఉంది అని ఈ కథలోని భావం.




కామెంట్‌లు