Panchatantra Stories In Telugu With Moral Written

చెట్టులో దేవుడున్నాడు

ఒక ఆశ్రమంలో ఒక సాధువు ఉన్నాడు. ఆయనకు చాలా మంది శిష్యులు ఉన్నారు.ఒకరోజు ఆయన తన శిష్యులతో అన్ని ప్రాంతాల్లోనూ దేవుడు ఉన్నాడు. కనుక మీరు అందరికీ నమస్కరించండి అని ఆజ్ఞాపించాడు. ఒకరోజు ఆ శిష్యుడు హోమానికి అవసరమైన కట్టెలు తీసుకురావడానికి అడవిలోకి వెళ్ళాడు. అప్పుడు హఠాత్తుగా పారిపోండి పారిపోండి మదపుటేనుగు వస్తుంది అని పెద్దగా ఒక కేక వినిపించింది. కాకి కావడంతోనే అక్కడున్న వారందరూ పారిపోయారు. అయితే ఆ శిష్యుడు మాత్రం అక్కడి నుండి కనీసం జరగని ఐనా జరగలేదు. నేనెందుకు పరిగెత్తాలి నేను దేవుణ్ణి. ఆ ఏనుగు దేవుడే అని అనుకుంటూ ఒక అడుగైన అటు ఇటు వేయకుండా అక్కడే నిలబడ్డాడు. ఏనుగు కి నమస్కరించి భగవంతుడిని కీర్తించు సాగాడు. అతడిని చూసి ఏనుగు పైనున్న మావటివాడు పారిపో పారిపో అని అరిచాడు. అప్పటికి ఆ శిష్యుడు పారిపోలేదు. ఆ శిశువుని ఏనుగు సమీపించి తన తొండంతో అతడిని చుట్టి ఒక పక్కకు విసిరేసింది. అతడికి బలమైన గాయాలు తగిలి సొమ్మసిల్లి పడిపోయాడు.ఆశ్రమ వాసులు జరిగినదంతా తెలుసుకుని అతడిని ఆశ్రమానికి తీసుకు వచ్చారు. శిష్యుడు క్రమంగా తెలువిలోకి వచ్చాడు. మిగతా శిష్యులతో ఒకడు అతన్ని చూసి ఏనుగు వస్తున్న సంగతి నీకు తెలుసు కదా నువ్వు ఎందుకు అక్కడినుండి పారిపోలేదు అని అడిగాడు. అందుకు శిష్యుడు ఇలా జవాబిచ్చాడు.
ప్రపంచంలోని జీవరాసులని భగవంతుని రూపాలే.మానవుడు జంతువు తదితర జీవరాసుల అన్నిటిలోనూ ఆయన ఉన్నాడని మన గురువు గారు చెప్పారు కదా. కనుకనే ఏనుగులు చూసినప్పుడు నేను ఏనుగు రూపంలో భగవంతుడు వస్తున్నాడు అని భావించాను. అందుకే అక్కడి నుండి పారి పోలేదు అన్నాడు.అయితే ఆ ఏనుగు పైనున్న మావటివాడు హెచ్చరించిన అప్పుడు అతని మాట పై నీకెందుకు నమ్మకం కుదరలేదు. నువ్వు ఆ మా బట్టి వాడితో ఉన్న భగవంతుడి మాటలను గౌరవించాల్సిందే. హాయ్ చేరికలు పట్టించుకోవాల్సిన ది కదా అన్నాడు.

ఈ కథలోని నీతి:పాపాత్ములు లోనూ పుణ్యాత్ములు లోనూ అలాగే మంచి వారిలోనూ చెడ్డ వారిలోనూ అందరిలోనూ దేవుడున్నాడు. అయితే భక్తి మంచితనం లేని వారితోనూ దుర్మార్గులను వెళ్ళకూడదు. వారికి దూరంగా ఉండాలి. మంచి వారితోనే స్నేహం చేయాలి.


నిజమైన బంధువు

ఒక గురువు తన శిష్యునికి ఈ లోకంలో నిజమైన బంధువు మిత్రుడు భగవంతుడే అని తక్కిన వారందరూ నామమాత్రపు వారేనని తెలియజేశాడు. కానీ శిష్యుని కి ఆ మాటలు నమ్మబుద్ధి కాలేదు.
అయ్యా నా తల్లి తండ్రి భార్య ఇతర బంధువులు అందరూ నన్ను శ్రద్ధ భక్తితో ప్రేమిస్తున్నారు. నేను లేనిదే వారు క్షణమైనా ఉండరు. వారి ప్రేమను నేను ఎలా సందేహం ఇస్తాను అన్నాడు శిష్యుడు.
నాయనా వారి ప్రేమ తాత్కాలికమే అది నిజమని శాశ్వతమని అనుకోవడం అవివేకం. ఈ విషయాన్ని నీకు ప్రత్యక్షంగా నిరూపిస్తాను.నేను చెప్పినట్టు చెయ్యి ఇంటికి పోయి ఈ మాత్రలు మింగి పండుకో. వీటి ప్రభావము వల్ల కొంత సేపటికి నీకు మరణించినట్లు పైకి కనిపించిన  నీవు వింటావు చేస్తావు అన్నాడు గురువుగారు.
శిష్యుడు గురువు చెప్పిన ప్రకారం మాత్రలు మింగి  మంచంపై పడుకున్నాడు. అతని తల్లి భార్య అందరూ దుఃఖిస్తున్నారు. ఇంతలో గురువు వైద్యుని వేషంలో వచ్చాడు.
శిష్యుని నాడీ పరీక్షించి చెప్పగానే వారి ఆనందానికి అంతులేకుండా పోయింది.

త్వరగా బతికించండి స్వామి గారు అన్నారు.
అప్పుడు వైద్యుడు నా దగ్గర ఉన్న ఈ మందుల్లో సగం ముందుగా అతని బంధువులు ఎవరైనా తినాలి. మిగిలిన సగభాగం రోగి మింగితే అతడు బతుకుతాడు. కానీ మొదట మిగిలిన వారు మాత్రం మరణిస్తారు. మీరు ఎవరైనా ముందుకు వచ్చి ఈ మందు తిని అతని బ్రతికించండి.తల్లి భార్య ఇతర బంధువులు ఎవరైనా సరే రోగిని బ్రతికించి అతనిపై మీకు గల ప్రేమాభిమానాలను నిరూపించుకోండి అని వైద్యుడి వేషంలో ఉన్న గురువుగారు.

ఈ మాటలన్నీ శిష్యుడు మంచం పై పడుకొని వింటున్నాడు. వైద్యుడి మొదట అతని తల్లిని పిలిచి చెప్పాడు. తల్లి ఈ మందు తీసుకొని నీ కుమారుని ప్రాణం కాపాడుకో కుమారునికి నీ ప్రాణాలు అర్పించి అమ్మ తనని నిలబెట్టుకో అన్నాడు వైద్యుడు.

తల్లి మందును చేతిలోకి తీసుకుని కొంత సేపు ఆలోచించి అయ్యా నాకు ఇంకా పిల్లలు ఉన్నారు. నేను లేకపోతే వారి ఏమైపోతారు. వారిని ఎవరూ పెంచి పెద్ద చేస్తారు అని బదులు చెప్పింది తల్లి. తర్వాత వైద్యుడు మీ భార్యని పిలిచి మందు ఆమె చేతిలో పెట్టాడు. ఆమె దుఃఖిస్తూ కొంతసేపు ఆలోచించి నా భర్త కొరకు నేను మరణించడానికి సిద్ధమే, కానీ నేను లేనిదే ఈ పసి పిల్లలు ఎవరు ఆదరిస్తారు. కనీసం పిల్లల కొరకు అయినా నేను జీవించాలి అని బదులు చెప్పింది.

ఈ మాటలన్నీ వింటున్నా శిష్యునికి గురువు బోధన లోని యదార్థం బోధపడింది. వెంటనే అతడు మంచం పైనుండి దిగ్గున లేచి గురువుకు నమస్కరించి మహాత్మ మీరు చెప్పింది వాస్తవం. మీరందరూ నన్ను నిజంగా ప్రేమిస్తున్నారని అనుకున్నాను. నేను ఇప్పుడు ప్రత్యక్షంగా వాస్తవాన్ని తెలుసుకోగలిగాను మనకు నిజమైన బంధువు స్నేహితుడు ఆ దేవుడు ఒక్కడే అని తెలుసుకున్నాను అన్నాడు శివుడు.


ఈ కథలోని నీతి: మీరు జీవితాన్ని ప్రేమించారా అయితే జీవితానికి ప్రధానమైన కాలాన్ని వ్యర్థం చేయకండి.

గంగయ్య పగటి కలలు

రామపురం లో గంగయ్య ఒక వ్యక్తి ఉండేవాడు అతను చాలా వింత మనిషి.పొరుగూరిలో ఒకరి ఇంటిలో వ్రతం జరుగుతుండగా ఆ ఇంటి వాళ్ళు గంగయ్య కు ఒక సంచడు ధాన్యం దానంగా ఇచ్చారు. వాటిని భుజాన వేసుకుని ఎండలోనే ఇంటి ముఖం పట్టాడు. దారిలో సేద తీర్చుకునేందుకు కుండలు చేసే కుమ్మరి వారి ఇంటి వద్ద ఆగి అరుగుమీద పండు కున్నాడు. అందుకు వాళ్లు అనుమతి కూడా తీసుకున్నాడు. అరకు మీదనే కొండ పెట్టుకుని కూర్చున్నాడు. తన దగ్గర ఉన్న దాన్యం గింజల గురించి ఆలోచించసాగాడు. ఈ మూట లోని విత్తనాలు పెరట్లో వేస్తే అది కొన్నాళ్లకు పెరిగి పెద్దదై చేతికి వస్తుంది. ఆ పంట ధాన్యం కొన్ని ని ఎకరాలు వేస్తే చెప్పలేని దాన్యం పడుతుంది.అమ్మితే వచ్చే డబ్బుతో పాడి పశువుని కొన్ని, పాలు అమ్మితే కొన్ని వేల రూపాయలు ఆదాయం వస్తుంది. అప్పుడు నేను కాలు మీద కాలు వేసుకొని మహారాజులా బతుకుతాను. అలా సంపద లో ఉన్న సమయంలో నా బంధువులు అందమైన తన అమ్మాయిని ఇచ్చి వివాహం జరిపేందుకు పోటీ పడుతూ ఉంటారు. అయితే నేను మాత్రం చీమకుర్తి నా అంతస్తుకు తరగని చెప్తాను. వాలు అంతటితో ఊరుకోకుండా కాళ్లావేళ్లా పడతారు. అప్పుడు నేను ఛీ పో అని కాలితో తన్ను తన్ను తాను. అటు కొండలు కూడా కన్నేశాడు గంగయ్య. కొండలు అన్ని పగిలిపోయాయి. ఆ ఇంటి యజమాని కుండలో పగిలి పోవడం చూసి కోపం అయ్యాడు. గంగయ్య పట్టుకుని నాలుగు దెబ్బలు వేసాడు ఇక్కడి నుంచి తరిమివేశారు.

కథలోని నీతి: పగటి కలలు కంటూ గాల్లో మేడలు కట్టకూడదు.


సాధువుగా మారిన దొంగ

ఒకరోజు రాత్రి ధనవంతునికి చెందిన తోటలో కాయలు దొంగిలించడానికి దొంగ వచ్చాడు. కొన్ని కాయలు కోశాడు. ఆ అలికిడికి తోట లో ఉండే నౌకర్లు లేచి తోటలో వెతక సాగారు.
దొంగతనానికి వచ్చిన దొంగ పట్టుబడకుండా తప్పించుకోవాలని ఒంటికి విభూతి రాసుకొని చేతులు జోడించి కళ్ళు మూసుకొని చెట్టు కింద కూర్చుని సాధువులాగా కొంగ జపం చేయసాగాడు. నౌకర్లు దొంగను పట్టుకోలేక పోయారు.కానీ ఆ తోటలో జపం చేసుకుంటున్న సన్యాసి చూసి వారు చాలా చాలా సంతోషించారు.మరుసటి రోజు ఆ తోటలో ఒక సాధువు బస చేస్తాడన్న వార్తా సుడిగాలిలా ఊరిలో పాకిపోయింది. చాలామంది ప్రజలు తినుబండారాలను తీసుకొనివచ్చి సాధువు కాళ్ల దగ్గర పెట్టారు. కొంతమందిని అతడి పాదాల వద్ద వెండి బంగారం డబ్బులు కూడా పెట్టారు. నేను దొంగ సన్యాసి నీ కదా అయినా ఇంత మంది ప్రజలు తమ పట్ల భక్తి శ్రద్ధలు చూపుతున్నారు. ఎంత ఆశ్చర్యం అని ఆ దొంగ ఆలోచించాడు నేను నిజంగానే సాధువుగా మారితే ఎంతమందో ఎందరో గౌరవిస్తారని ఆలోచించి నిజమైన సాధువు కావడానికి తీర్మానించుకున్నాడు కొంతకాలానికి ఆ దొంగ నిజంగానే గొప్ప సాధువుగా మరి భగవంతుని కృపను పొందాడు.
ఈ కథలోని నీతి; అందరూ పవిత్రతని గౌరవిస్తారు.


చీమ పావురం

ఒక నది ఒడ్డున ఉన్న మర్రిచెట్టు ఒక పావురం నివసిస్తుంది దానికి నదిలో నీటి ప్రవాహంలో చీమ కొట్టుకుపోతున్న కనబడింది. ఎలాగైనా కాపాడాలి అనుకున్నది పావురం.
వెంటనే ఒక మర్రి ఆకును విసిరి చీమకు దగ్గరగా నీళ్లలో వేసింది పావురం. ఆకుపై  చీమ ఎక్కి కూర్చుంది. తెలుసునా ఆ ఆకు ఒడ్డుకు చేరడంతో చీమ భూమి పైకి వచ్చింది. పావురం చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలిపింది చీమ.
చీమ కొంత దూరం ప్రయాణం చేస్తూ అటు వైపు వస్తున్న ఒక వేటగాడు ఆ వేటగాడు పక్షుల కోసం నాలుగు వైపులా గాలించడం చెట్టు కొమ్మపై కూర్చొని తినడంలో నిమగ్నమైన పావురాన్ని కూడా వేటగాడు చూడడం కూడా చీమ చూసింది. ఒక్క క్షణంలో వేటగాడు చెట్టు వెనుక దాక్కొని బాణం ఎక్కుపెట్టి పావురానికి గురిపెట్టాడు. ఇది గమనించిన చీమ పరుగుతో వేటగాని సమీపించి వదిలే సమయం చూసి చీమ కుట్టింది. ఆ బాధతో వేటగాడు అరిచాడు. బాణం గురి తప్పి పావురం పక్క నుండి దూసుకుంటూ పోయింది పావురం అక్కడి నుండి మరొక చోటికి ఎగిరిపోయింది. తాను ఇలా రక్షించబడడం అన్న సంగతి పావురానికి తెలియరాలేదు. కానీ చీమకు మాత్రం తాను పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసేందుకు చీమకు సంతోషంగా ఉంది.

ఈ కథలోని నీతి: మంచి వారికి తెలియకుండానే ఉపకారం జరుగుతుంది.

ఆవులు సింహం

ఒక అడవిలో నాలుగు ఆవులు కలిసి మెలిసి ఒకే దగ్గర మేతమేస్తూ ఉండేవి.ఎక్కడికి వెళ్లాలన్నా అవి నాలుగు కలిసి కట్టుగా ఉండేది. ఆనందంగా జీవించేవి.ఒకనాడు ఒక సింహం ఆ దారిన పోతూ ఉన్న ఆవులను చూసి నాకు మంచి విందు భోజనం లభించింది అనుకుంటూ మేత వేయుచు నా ఆవుల వద్దకు  సింహం వెళ్ళింది. సింహం రావడం గమనించిన ఆవులు భయపడక నాలుగు ఆవులు కలిసితమ వాడి కొమ్ములతో సింహం వైపు వెళ్లాయి. నాలుగు ఆవులు కలిసి కట్టుగా సింహం పై పడగానే సింహం భయపడి పారిపోయింది.కొంతకాలము తరువాత ఆవులు తమలో తాము పోట్లాడుకొని విడిపోయి వేరు వేరు ప్రాంతాలలో  మేత మేత సాగినవి.ఈ విషయం తెలుసుకున్న సింహం ఒక్కొక్క అవును వరుసగా విడివిడిగా చంపి తిన్నది.
కథలోని నీతి; అందరూ కలిసిమెలిసి జీవిస్తే ప్రమాదాలకు తావులేదు.

స్నేహము

ఒకరోజు ఇద్దరు స్నేహితులు వేసవి సెలవులకు పట్టణములో ఉన్న వారి బంధువుల ఇంటికి పోతున్నారు. అది అడవి మార్గం. దారిలో వారికి ఒక ఎలుగుబంటి కనబడింది. దానిని చూసి ఇద్దరు స్నేహితులు పరిగెత్తుకుంటూ ఒక చెట్టు వద్దకు చేరారు. ఒకడు చెట్టు పైకి ఎక్కాడు. రెండవ వానికి చెట్టు ఎక్కడం రావడం లేదు.పోనీ మిత్రుడైన సాయం చేస్తాడేమో అంటే ముందే చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు. రెండవ వాడు వెంటనే ఒక ఉపాయం ఆలోచించి చచ్చిన వాడిలా ఆ చెట్టు కింద పడుకోమన్నాడు. ఇంతలో ఎలుగుబంటి రానే వచ్చింది. శవంలా పండుకున్న వానిని వాసన చూసి చచ్చిన శవం అని వెలుగు బంటి వెళ్ళిపోయింది.
ఎలుగుబంటి దూరంగా వెళ్ళిపోయినా తరువాత చెట్టు ఎక్కిన వాడు తిరిగి పడుకున్న వాడిని దగ్గరకు వచ్చి మిత్రమా రైలుబండి నీ చెవిలో ఏం చెప్పింది అని అన్నాడు. దానికి సమాధానం గా రెండో వాడు ఆపదలో ఉన్న మిత్రుడికి సహాయ పడని వాళ్ళతో స్నేహం చేయరాదు అని చెప్పింది. అది విన్న మిత్రుడు సిగ్గుతో తలదించుకున్నాడు.

కథలోని నీతి; ఆపదలో ఆదుకునే వాడే నిజమైన మిత్రుడు.


రాజ కుమారులు ఏడు చేపలు

ఒక రాజుగారికి ఏడుగురు కొడుకులు.ఒక రోజున ఆ ఏడుగురు రాజకుమారులు చెరువు దగ్గరకు వెళ్లి గాలులు  వేసి ఏడుగురు ఏడు చేపలు పట్టారు. వాటిని ఎండలో ఎండబెడతారు.ఆరు చేపలు బాగా ఎంజాయ్ కానీ ఒక చేప మాత్రం అసలు ఎండనే లేదు.
చేపా చేపా ఎందుకు ఎండలేదు అని అడిగాడు. నేను ఏలాగా ఎండు తాను మరి ఎండ లేదుగా అంది. మరి మిగతా ఆరు చేపలు ఎండఇ కదా అన్నారు వాళ్ళు నేనేం చేయను ఆ గడ్డి దుంప నాకే అడ్డం వచ్చింది. అప్పుడు గడ్డి దుంప గడ్డి దుంప ఎందుకు అడ్డం వచ్చావు అన్నారు రాజకుమారులు. నేనేం చేయలేను నన్ను ఆవునెయ్యి లేదు కదా. ఆవు ఆవు గడ్డి నీ ఎందుకు తినలేదు అని అన్నారు. నేనేం చేయను కాపరి నన్ను మేప లేదుగా అంది ఆవు. కాపరి ఆవును ఎందుకు లేపలేదు అని అడిగారు. అయ్యా రాజకుమారుల రా నేనేం చేయను నాకు బువ్వ పెట్టలేదు అని చెప్పాడు కాపరి. అప్పుడు యువరాజులు అవ్వ దగ్గరకు వెళ్లి అవ్వ అవ్వ కాపరికి ఎందుకు పెట్టలేదు అని అడిగారు. నా చిన్నారి బుజ్జిగాడు ఏడ్చాడు బాబుల్లారా కాపరికి బువ్వ పెట్టలేదు అందుకు. అని సాగదీసింది. బుజ్జి బుజ్జి ఎందుకు ఏడ్చావు అమ్మా అని అడిగారు జాలిగా. ఆ బుజ్జి గాడు నాకు చీమ కుట్టింది అని అన్నాడు. చీమ బుజ్జి గాని ఎందుకు కొట్టావు అని అడిగారు. నేనేం చేయను నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కొట్టకుండా కోరుకుంటాను అంటే చీమ. చీమ చీమ బలే తెలుగు ఎంత నీది అన్నారు రాజకుమారులు. అప్పుడు గుర్రమెక్కి రాజకుమారులు రాజ ప్రసాదానికి ఉడాయించారు.

బాతు బంగారు గుడ్లు

ఒక గ్రామంలో సూరయ్య అనే రైతు దంపతులు ఉన్నారు. అతడు ఒక బాతు పిల్లలు తెచ్చి ముద్దుగా పెంచసాగారు. బాతు పిల్ల పెరిగి పెద్దదయింది. అది బంగారు గుడ్లు పెట్టింది. సూరయ్య దంపతుల ఆనందానికి అంతులేదు. అలా బాతు రోజుకు ఒక్క బంగారు గుడ్డు చొప్పున ప్రతి నిత్యము పెడుతూ ఉన్నది. సూరయ్య దంపతులకు రోజు బంగారం లభించడంతో ఆనందంతో వోళ్ళు మర్చిపోయారు. ఆ దంపతులిద్దరికీ దురష కలిగింది. ఒకరోజు సూరయ్య దంపతులు ఈ బాతు రోజుకు బంగారు గుడ్డు పెడుతుంది కదా. దీని పొట్టలో ఇంకా చాలా బంగారు గుడ్లు ఉండి ఉంటాయి.ప్రతి రోజు ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి ఉండటం కంటే ఆ బాతులు కోసి దాని పొట్ట లోని అన్ని ఒకేసారి తీసుకుంటే బోలెడు బంగారు గుడ్లు ఒకేసారి దొరుకుతుంటాయి అని భార్యభర్తలిద్దరు నిర్ణయించుకున్నారు. ఆలస్యం ఎందుకని సూటయ్యే దంపతులు బాతుని కోసి వేశారు. కానీ అందులో ఒక్క బంగారు గుడ్డు కూడా కనబడలేదు.సూరయ్య దంపతులు లబోదిబోమని నెత్తి నోరు కొట్టుకుని కుంగి కృశించి నశించి చారు.

ఈ కథలోని నీతి: అత్యాశ దుఃఖానికి చేటు.

అతి సుందరమైన చేతులు

ఒక ఉద్యానవనం లో ముగ్గురు రాజకుమార్తెలు కూర్చుని ఉన్నారు.వారిలో ఎవరి చేతులు ఎక్కువ అందంగా ఉన్నాయ్ అన్న ప్రశ్న ఒక్కసారి తలెత్తింది.ఆ ముగ్గురు తన చేతులే మిగతా ఇద్దరి కంటే చాలా అందంగా ఉన్నాయని తమలోతాము అనుకున్నారు.అప్పుడే అక్కడికి ఒక దేవకన్య బిచ్చమెత్తుకుని అమ్మాయి రూపంలో వచ్చింది. ధర్మం చెయ్యండమ్మా అని అడిగింది.ఈ కన్నెలు తమ విలువైన దుస్తులను సర్దుకుని ముక్కలను పక్కకు తిప్పేసుకున్నాను.అక్కడి నుండి ఆ అమ్మాయి దగ్గరలో ఉన్న పూరీలు చేరింది. ఆ ఇంట్లో ఉన్న నిరుపేద శ్రీ ఆ అమ్మాయి కి అన్నం పెట్టి మంచినీళ్లు అందించింది. మారువేషంలో ఉన్న ఆ దేవకన్య ఆ శ్రీ ని మంచిగా ఆరోగ్యంగా ఉండు అని దీవించింది. ఆ శ్రీని ఆ అమ్మాయిలు అలా ఆశీర్వదించడం ఆ ముగ్గురు రాజకన్యలు చూస్తూ ఉండిపోయారు. బిచ్చ  రూపంలో ఉన్నఆ దేవకన్య తన నిజ రూపం ధరించి తన తోటివారికి సహాయం పడటానికి సిద్ధంగా ఉన్న ఉన్న చేతులే అతి సుందరమైన చేతులు అని ఆ ముగ్గురితో చెప్పి దేవకన్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది.ఇతరులకు సహాయపడటం లోనే ఆనందం గొప్పతనం ఉంటుంది.

ఈ కథలోని నీతి: ఇతరులకు సహాయపడే మనసు పేద వారికి దానం చేసే చేతులే గొప్పవి.

కామెంట్‌లు