Telugu Interesting Facts చెట్లను నరకడం వల్ల ప్రకృతికి ఎలాంటి నష్టం ఏర్పడుతుందో చూడండి

Telugu facts

ఫ్రెండ్స్ చాలా మంది చెట్లను నరుకుతూ ఉంటారు దీనివల్ల ప్రకృతికి చాలా నష్టం ఎదురవుతోంది అలాగే వర్షాలు సరిగా పడవు దీని వల్ల మానవాళికి నీరు దొరకడం చాలా కష్టం అవుతుంది భవిష్యత్తులో మన పిల్లలకు కూడా ఇబ్బంది ఎదురవుతుంది ఇలా కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు చెట్లను నాటండి. చెట్టు గురించి చి మనం ఇప్పుడు తెలుసుకుందాం.



మాట రాణి మూగజీవాలుమనకు చేసే సహాయం చాలా గొప్పది. ఎంతో విలువైనది కూడా అది మనందరికీ తెలుసు. అలాగే చెట్టు జాతి కూడా మానవాళికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి. అలాంటి చెట్లను కాపాడుకొనుట మనందరి బాధ్యత. మానవ ధర్మం కూడా. కనుక మానవునిగా ఈ భూమ్మీద జన్మించినందుకు భూమి తల్లి రుణం తీర్చు కోండి. చెట్టు నాటి దాన్ని పెంచి మంచి మనిషిగా అందరూ జీవించండి. అదే మన అందరి కోరిక.ప్రతి మనిషి తన వంతు బాధ్యతగా తమ ఇంటి ముందు గానీ వెనుక గానీ దొడ్డి లో గాని అదేవిధంగా రహదారుల లో కానీ ప్రతి ఒక్కరు చెట్లను నాటండి పర్యావరణాన్ని రక్షించండి. వేపచెట్టు ఇతర చెట్టయినా పెంచుట లో మానవాళి గా ప్రకృతికి మేలు చేయండి.కన్న తల్లి రుణం ఎలా తెలుసుకుంటాము భూమి తల్లి రుణం కూడా అదే విధంగా అందరూ తెలుసుకోవాలి. ఇది ప్రతి మనిషి బాధ్యత మీరు చెట్టు నాటి ప్రకృతికి సహాయపడండి ప్రకృతి మీకు సహాయపడుతుంది. ఈ రోజే మీరు ఒక చెట్టును నాటండి. ముందు తరాల వారికి సహాయపడండి. అలనాటి ఆదిమ మానవుడు నుండి నేటి ఆధునిక మానవుడి వరకు వృక్షజాతి మొత్తం తమ అణువణువు మానవాళికే అర్పిస్తూ ఉన్నాయి. నేటి మానవుడు చెట్లను నరికి పల్లెల నుండి పట్టణాల వరకు పరిసరాలను కలుషితం చేస్తున్నాడు. దీనివలన 80 శాతం గల అటవీ భూములు 22 శాతానికి చేరుకున్నాయి. దీనివలన ప్రపంచంలో అత్యధిక వర్షపాతం ఉన్న chirapunjee ప్రాంతంలో నీటి కరువు ఏర్పడిందని పరిశోధకులు చెప్పారు. ఈ విధంగా కాకుండా ప్రతి ఒక్కరు చెట్లను పెంచి ప్రకృతికి మేలు చేయండి.
ఈ విధంగా ప్రకృతికి మేలు చేస్తే అది మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ విధంగా కలిసికట్టుగా ప్రతి ఒక్కరు చెట్లను నాటండి.మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. చెట్లు ఎక్కువగా ఉంటే వర్షం కూడా బాగా పడుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ చేయాల్సిన బాధ్యత ఉంది.

కామెంట్‌లు